కేజ్రీవాల్‌ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు | KCR Sensational Comments on CM Kejriwal Arrest | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు

Mar 23 2024 4:10 AM | Updated on Mar 23 2024 4:10 AM

KCR Sensational Comments on CM Kejriwal Arrest - Sakshi

మాజీ సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు దేశ ప్రజాస్వామిక చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ అరెస్టును ఖండిస్తూ శుక్రవారం కేసీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తోంది.

ఇటీవలి కాలంలో జరిగిన జార్ఖండ్‌ ముఖమంత్రి హేమంత్‌ సోరెన్, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతల అరెస్టు కోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటోంది. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తోంది. కేజ్రీవాల్‌ అరెస్టు రాజకీయ ప్రేరేపితమైంది. అక్రమ కేసులను వెనక్కి తీసుకొని, అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement