జన్వాడ ఫామ్‌హౌస్‌ ఘటన: డీజీపీకి కేసీఆర్‌ ఫోన్‌ | kcr reacts on janwada farmhouse incident | Sakshi
Sakshi News home page

జన్వాడ ఫామ్‌హౌస్‌ ఘటన: డీజీపీకి కేసీఆర్‌ ఫోన్‌

Oct 27 2024 6:58 PM | Updated on Oct 27 2024 7:21 PM

kcr reacts on janwada farmhouse incident

సాక్షి,హైదరాబాద్‌ : జన్వాడ ఫామ్‌హౌస్ ఘ‌ట‌న‌పై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు.  తెలంగాణ డీజీపీ జితేందర్‌కి కేసీఆర్ ఫోన్ చేశారు. రాజ్ పాకాల‌, శైలేంద్ర పాలకాల ఇళ్ల‌ల్లో ఎలాంటి సెర్చ్‌ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు. వెంట‌నే సోదాలు నిలిపివేయాల‌ని డీజీపీని కోరారు. 

కాగా, శనివారం జన్వాడలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు 30 ఎకరాల్లో ఉన్న ఫామ్‌హౌస్‌పై సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. భారీ శబ్దాలతో ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు. ఇక్కడ డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించిన పోలీసులు..విజయ్‌ మద్దూరి అనే వ్యక్తి కొకైన్‌ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం సహా భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. 

👉చదవండి : రేవ్‌ పార్టీ అంటూ అసత్య ప్రచారమా? బీఆర్‌ఎస్‌ ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement