యువకుడిపై కర్రలు, పిడిగుద్దులతో రెచ్చిపోయిన పోలీసులు | Karimnagar Police Officers Named in Attack | Sakshi
Sakshi News home page

యువకుడిపై కర్రలు, పిడిగుద్దులతో రెచ్చిపోయిన పోలీసులు

Jun 26 2026 11:25 PM | Updated on Jun 26 2026 11:51 PM

Karimnagar Police Officers Named in Attack

కరీంనగర్‌: రాంనగర్‌లో ఓ యువకుడిని కర్రలతో కొట్టి, పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు పోలీసులు. దారికి అడ్డంగా బైక్ పెట్టాడనే నెపంతో ఇంట్లో నుంచి బయటకు లాగి యువకుడిపై ఆర్ఐ రమేశ్‌, ఆర్ఎస్ఐ దత్తు, కానిస్టేబుల్ పరుశురాం దాడి చేసినట్లు తెలుస్తోంది.

సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులను గుర్తించక వారితో వాగ్వాదానికి దిగాడు బాధిత యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి కరీంనగర్ టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement