కరీంనగర్: కరీంనగర్ సాయినగర్‌లోని ఓ ఆస్పత్రి వద్ద మగశిశువును విక్రయించిన తల్లి, కొనుగోలు చేసిన దంపతులతో పాటు మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని సాయిబాబ ఆలయం వద్ద ఉన్న ఆస్పత్రిలో ఓ బాలుడిని రూ.6లక్షలకు విక్రయిస్తున్నారని గురువా రం రాత్రి చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ వచ్చింది. సంబంధిత అధికారులు టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు శుక్రవారం బాలుడిని గుర్తించి శిశుగృహ కు తరలించారు. బాలుడి తల్లి హైదరాబా ద్‌కు చెందిన శీలం సాయిశ్రీ మధ్యవర్తుల ద్వారా కరంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపలి్లకి చెందిన బావండ్ల రాయమల్లు,– లతకు రూ.6లక్షలు విక్రయించారని పోలీసులు పేర్కొన్నారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి జోగు తిరుపతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


