సాక్షి, హైదరాబాద్: సాగునీటి కష్టాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని రేవంత్ సర్కార్ చెబుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కరెంట్ కష్టాలతోనూ తమకెలాంటి సంబంధం లేదని ప్రభుత్వం అంటుంది. ఇవన్నీ ప్రకృతి తెచ్చిన కష్టాలుగా ప్రభుత్వం చెబుతూ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఈ రోజు శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మట్లాడారు. శాసనసభలో ఎలినినో పై చర్చ సందర్భంగా ప్రకృతి తెచ్చిన కరువుగా ప్రభుత్వం చెప్పిందని ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్, రేవంత్ తెచ్చిన కరువని దుయ్యబట్టారు.
హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్ కోసం బాధ్యతగా మాట్లాడుతున్నా నీళ్లు, కరెంట్ ప్రకృతి తెచ్చిన కరువు కాదుకృష్ణా జలాల్లో శ్రీశైలం ప్రాజెక్టు లో 84 టీఎంసీ లు వాడుకుంటే ఆ నీళ్లు ఎక్కడ కల్వకుర్తి ద్వారా ఎత్తింది 8 టీఎంసీ లే మరి 84 టీఎంసీ లు ఎక్కడ ఎత్తారు. కల్వకుర్తి లో ఈ రోజు కూడా 5 మోటార్లలో అన్ని ఎందుకు నడపడం లేదు కాంగ్రెస్ వచ్చిన మూడేళ్లలో అతి తక్కువ నీటి వినియోగం కృష్ణా జలాల్లో ఏపీ 71.5 శాతం వాడితే... తెలంగాణ 28 శాతం మాత్రమే వాడింది అని అన్నారు.
కాంగ్రెస్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షం పై దాడి చెయ్యడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా సుందిల్ల, అన్నారం బ్యారేజీలపై వెరీ గుడ్ అని cpwrs నివేదిక ఇచ్చింది.మేడిగడ్డ వద్ద ఒక బ్లాక్ మాత్రమే సమస్య మేడిగడ్డ వద్ద 4 TMC లు నీటి ప్రవాహం ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే నీళ్ళు ఎత్తి పోసుకోవచ్చురిటైర్డ్ ఇంజనీర్లు కూడా నీళ్లు ఎత్తి పోసుకోవచ్చుని లేఖ రాశారని హరీష్ రావు రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు.


