మహబూబ్‌నగర్ క్రైం: ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసు కుంది. వన్‌టౌన్ ఎస్‌ఐ శీనయ్య కథనం ప్రకారం.. నగరంలోని మదీ నా మజీద్ ఏరియాకు చెందిన హాబీబ్ ఉమేద్(18) నగరంలో ఓ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివాడు.
ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఇటీవల మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. కాగా గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కూడా ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తానికి గురై ఉమేద్ మధ్యాహ్నం సమయంలో ఇంట్లో దుప్పటితో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తండ్రి మక్సూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. మక్సూద్‌కు ఇద్దరు కూతుర్తెలతో పాటు కొడుకు హాబీబ్ ఉమేద్ ఉన్నారు.


