సాక్షి, హైదరాబాద్: ‘ఓ వెబ్‌సైట్‌లో పైరసీ సినిమా చూస్తే ఏమవుతుంది ? తక్కువ రేటుకే అది అందుబాటులో ఉంది కదా! అని అనేక మంది భావిస్తున్నారు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత ఇదే అంశాన్ని పలువురు లేవనె త్తారు. ఈ వ్యవహారంలో పైకి పైరసీ కని పిస్తున్నా, అంతర్గతంగా బెట్టింగ్ దందా, డేటా చోరీ ఉన్నాయి’అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. ‘ఐ బొమ్మ’ కేసులకు సంబంధించి ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు సజ్జనార్ మాటల్లోనే... 2019లో తొలి వెబ్‌సైట్ ఏర్పాటు: విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవి ఎంబీఏ పూర్తి చేశాడు.
హైదరాబాద్‌కు వలసవచ్చిన అతగాడు తొలినాళ్లల్లో వెబ్ సర్వీస్‌లు అందించే ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఆపై పైరసీ దందాలోకి దిగి.. 2019లో ఐ బొమ్మ, 2022లో బప్పం టీవీ పేర్లతో వెబ్‌సైట్లు ఏర్పాటు చేశాడు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మరోటి తెరుస్తూ మొత్తం 65 మిర్రర్ సైట్లు రూపొందించాడు. వీటిని హోస్ట్ సర్వర్లను స్విట్జర్లాండ్‌లో పెట్టాడు. కరేబియన్ దీవులతోపాటు నెదర్లాండ్స్, ఫ్రాన్స్, దుబాయ్‌ల్లోనూ సంచరిస్తూ ఆయా దేశాల్లో ఖరీదు చేసిన 110 డొమైన్స్ ద్వారా ఈ వెబ్‌సైట్లు హోస్ట్ చేశాడు.
ఇతడి నుంచి స్వా«దీనం చేసుకున్న హార్డ్‌డిస్‌్కల్లో 21 వేల చిత్రాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిలో 1972 నాటి గాడ్‌ఫాదర్ నుంచి తాజా సినిమా ఓజీ వరకు ఉన్నాయి. రవి రెండేళ్ల క్రితం భారత పౌరసత్వం వదిలేసి కరేబియన్ దీవుల్లో ఒకటైన సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ దేశ పౌరసత్వం పొందాడు. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, ఇతగాడు మహారాష్ట్రకు చెందిన ప్రహ్లాద్ కుమార్ వెల్లెల పేరుతో ఓ డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు.
బాధితుల్లో చిత్ర పరిశ్రమతో పాటు సామాన్యులూ...
ఇమ్మడి రవి నిర్వహిస్తున్న పైరసీ వెబ్‌సైట్ల ద్వారా సినీ పరిశ్రమతోపాటు సామాన్యులూ నష్టపోయారు. ఈ వెబ్‌సైట్ల ద్వారా యాడ్స్ ప్రమోట్ చేయడానికి అనేక బెట్టింగ్, గేమింగ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. ప్రధానంగా వన్ విన్, వన్ ఎక్స్ బెట్ సంస్థలు ఉన్నాయి. పైరసీ వెబ్‌సైట్‌లో సినిమా చూడటానికి క్లిక్ చేస్తే అది బెట్టింగ్ సైట్/యాప్‌కు రీడైరెక్ట్ చేస్తుంది. ఇలా అనేకమంది వాటికి బానిసలుగా మారి సర్వం కోల్పోయారు.
ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇతడికి సంబంధించిన ఒక బ్యాంకు ఖాతా విశ్లేషణ ద్వారా రూ.20 కోట్లు ఆర్జించినట్టు తెలుస్తోంది. ఇలాంటి 32 బ్యాంకు ఖాతాలను విశ్లేíÙంచాల్సి ఉంది. ఇమ్మడి రవిపై సిటీ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఇతడి ఇద్దరు అనుచరులు శివాజీ, ప్రశాంత్‌లను గతంలో అరెస్టు చేశారు. ఇతడు తన వెబ్‌సైట్ వీక్షకుల ఫోన్లు, కంప్యూటర్లలోని ఏపీకే ఫైల్స్ పంపి డేటాను తస్కరించాడు. ఇలా దాదాపు 50 లక్షల మంది డేటా హార్డ్‌డిస్‌్కల్లో భద్రపరిచాడు.
రవి వ్యవహారాలపై సీబీఐ, ఈడీలకు సమాచారం
స్కీన్ రికార్డింగ్‌తోపాటు సీక్రెట్ కెమెరాలతో రికార్డింగ్ ద్వారా రవి పైరసీ చేస్తున్నాడు. కొన్ని టెలిగ్రాం గ్రూపుల నుంచి కొన్ని చిత్రాలను ఖరీదు చేశాడు. ఇతగాడికి లండన్ సహా విదేశాల్లో కొందరు అనుచరులు ఉన్నట్టు తెలుస్తోంది. పైరసీ దందాతోపాటు బెట్టింగ్ యాడ్స్ ద్వారా వచ్చిన మొత్తంతో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు అనుమానాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇతడి అంశాన్ని సీబీఐ, ఈడీల దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు సమాచారం అందించనున్నారు. రెండు నెలల క్రితం కొందరు అరెస్టు అయినప్పుడు నన్ను పట్టుకోండి అంటూ తోపులా సవాల్ చేశాడు. ఇప్పుడు జైలులో ఉన్నాడు. రవి అరెస్టు తర్వాత పోలీసులకు వ్యతిరేకంగా అనేకమంది మీమ్స్ చేశారు. వీరి పైనా చర్యలకు రంగం సిద్ధం చేశాం. సైబర్ నేరాలతోపాటు సినీ పైరసీపై సమాచారం ఉంటే తక్షణం 1930కు కాల్ చేసి తెలియజేయాలి.


