ఘనంగా రికేల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ 12వ వార్షికోత్సవం | Sakshi
Sakshi News home page

ఘనంగా రికేల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ 12వ వార్షికోత్సవం

Published Sun, Dec 10 2023 3:24 PM

Hyderabad Reqelford School Programme 12th Anniversary Celebrations - Sakshi

మేడ్చల్ జిల్లా: కీసర మండలం రాంపల్లీ గ్రామంలో ఉన్న రికెల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు భరత నాట్యం నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ అల్లరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.

విద్యార్థులు అనునిత్యం ఫోన్లు దూరం పెట్టి చదువుపై శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఛైర్మెన్ ఉదయ్ కుమార్, ఎన్.జి.అర్.ఐ మాజీ చీఫ్ సైంటిస్ట్ కీర్తి శ్రీవాస్తవ, ఉస్మానియా యూనివర్సిటీ బయో కెమిస్ట్రీ హెచ్.ఓ.డీ సూర్య సత్యనారాయణ సింగ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement