హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈరోజు(శుక్రవారం, జూన్ 5వ తేదీ) 100పైగా స్పా సెంటర్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు పోలీసులు. అయితే స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
గత మూడు, నాలుగు నెలల నుంచి హైదరాబాద్‌లోని పలు స్పా సెంటర్లపై పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. హబ్సిగూడ, కూకట్‌పల్లి, వసంత్‌నగర్ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం ఆధారంగా పోలీసులు రైడ్లు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా చేసిన దాడుల్లో కూడా పలుచోట్ల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు.


