BJP MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

Hyderabad Police Arrested BJP MLA Raja Singh On 25th August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై షాహినాయత్‌ గంజ్‌లోని ఆయన ఇంట్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజాసింగ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో రాజాసింగ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది. 

అరెస్టుకు ముందు ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరో వీడియో విడుదల చేశారు. తాను తుపాకీ గుళ్లకు, ఉరిశిక్షకు భయపడేవాడిని కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తనను నగర బహిష్కరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజాసింగ్‌ ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో నమోదైన కేసులకు సంబంధించి మంగళ్‌హాట్‌, షాహినాయత్‌గంజ్‌ పోలీసులు ఈ రోజు ఉదయమే రాజాసింగ్‌కు 41(A) సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. మంగళ్‌హట్‌ పీఎస్‌లో 68/2022 క్రైమ్‌ నంబర్‌ కేసులో 505(2), 171, రెడ్‌విత్‌ 171 సెక్షన్లు , షాహినాయత్‌గంజ్‌ పీఎస్‌లో క్రైమ్‌ 71/2022లో 153(ఏ). 295 (ఏ), 504, 505(2) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.  24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మంగళ్‌హాట్‌ పోలీసులు కోరారు.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top