Hyderabad: పోలీసు ఫోన్‌ నెంబర్లు మారాయి.. కొత్త నెంబర్లు ఇవే

Hyderabad City Police Dials Up Airtel, Gets New Mobile Numbers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారుల ఫోన్‌ నెంబర్లు మారాయి. ఇప్పటి వరకు వినియోగిస్తున్న వాటి స్థానంలో ఎయిర్‌టెల్‌కు చెందినవి సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. పాత సర్వీస్‌ ప్రొవైడర్‌ సేవల వల్ల నెట్‌వర్క్‌ పరమైన ఇబ్బందులు వస్తుండటంతో పోలీసులు అధికారులు మరో సంస్థ సేవలు తీసుకోవాలని నిర్ణయించారు.

4జీ, 5జీతో పాటు అనేక వాల్యూ యాడెడ్‌ సర్వీసెస్‌ (వీఏఎస్‌) అందించడానికి ఎయిర్‌టెల్‌ సంస్థ ముందుకు వచ్చింది. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ పోలీసు విభాగం ఈ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తొలుత మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ ద్వారా ప్రస్తుతం ఉన్న నెంబర్లనే కొనసాగించాలని భావించారు.

అయితే దీనికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తుండటంతో నెంబర్లు మార్చాలని నిర్ణయించారు. దీంతో సోమవారం నుంచి 9490616––– సిరీస్‌కు బదులుగా 8712660–––, 8712661––– సిరీస్‌ల్లో ఆరోహణ క్రమంలో నెంబర్ల వినియోగం మొదలైంది. క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల కొత్త నెంబర్లు ప్రజలకు అలవాటు అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికోసం నెల రోజుల పాటు పాత నెంబర్లూ అందుబాటులో ఉంచుతున్నారు. 
చదవండి: వికారాబాద్‌లో సీఎం కేసీఆర్‌.. కలెక్టరేట్‌, టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ ప్రారంభం

అమలులోకి రాబోయే కొత్త నెంబర్లు ఇలా... 
పోలీసు కమిషనర్‌– 8712660001 
► అదనపు సీపీ (శాంతిభద్రతలు)– 8712660002 
► అదనపు సీపీ (నేరాలు)– 8712660003 
► సంయుక్త సీపీ (సీసీఎస్‌)– 8712660004 
► సంయుక్త సీపీ (ఎస్బీ)– 8712660005 
► సంయుక్త సీపీ (పరిపాలన)– 8712660006 
► సంయుక్త సీపీ (ట్రాఫిక్‌)– 8712660007 
► మధ్య మండల డీసీపీ– 8712660101 
► ఉత్తర మండల డీసీపీ– 8712660201 
► దక్షిణ మండల డీసీపీ– 8712660301 
► పశ్చిమ మండల డీసీపీ– 8712660401 
► తూర్పు మండల డీసీపీ– 8712660501 
► టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ– 8712660701 
► ప్రధాన కంట్రోల్‌ రూమ్‌: 871266000, 8712661000

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top