Hijras Stops And Attack On Young Man In Hyderabad Banjara Hills, Details Inside - Sakshi
Sakshi News home page

జేబులో ఉన్న డబ్బులు లాక్కున్న హిజ్రాలు.. ఇదేంటని ప్రశ్నిస్తే గొడవ.. తప్పించుకుని వెళ్తుండగా..

May 21 2022 8:19 AM | Updated on May 21 2022 3:35 PM

hijras Stops Young Man And Attack At Banjara Hills - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత మదీనా వద్ద నివసించే సయ్యద్‌ షాబాజ్‌(26) కృష్ణానగర్‌ వైపు నుంచి ఇందిరానగర్‌ వైపు బైక్‌పై వస్తుండగా ఇద్దరు హిజ్రాలు అడ్డగించారు. ఆయనతో మాటా మాటా కలిపారు. ...మాటల్లోకి దింపి

సాక్షి, బంజారాహిల్స్‌: యువకుడి నుంచి డబ్బులు లాక్కోవడమే కాకుండా రాయితో కొట్టి గాయపర్చిన ఘటనలో ఇద్దరు హిజ్రాలపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలివీ... గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత మదీనా వద్ద నివసించే సయ్యద్‌ షాబాజ్‌(26) కృష్ణానగర్‌ వైపు నుంచి ఇందిరానగర్‌ వైపు బైక్‌పై వస్తుండగా ఇద్దరు హిజ్రాలు అడ్డగించారు. ఆయనతో మాటా మాటా కలిపారు.

మాటల్లోకి దింపి ఆయన జేబులో ఉన్న రూ. 500లు లాక్కున్నారు. ఇదేమిటని ఆ యువకుడు ప్రశ్నిస్తుండగానే మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వారి నుంచి తప్పించుకొని వెళ్తుండగానే ఓ హిజ్రా రాయితో కొట్టడంతో షాబాజ్‌కు గాయాలయ్యాయి. అదే రాత్రి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హిజ్రాల కోసం గాలిస్తున్నారు. 
చదవండి: తాత కళ్లముందే దారుణం.. హైదరాబాద్‌లో మరో పరువు హత్య?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement