మే 23న ఎడ్‌సెట్‌..జూన్‌ 4,5 తేదీల్లో ఐసెట్‌ | The Higher Education Council has released the schedule for both the exams | Sakshi
Sakshi News home page

మే 23న ఎడ్‌సెట్‌..జూన్‌ 4,5 తేదీల్లో ఐసెట్‌

Feb 12 2024 4:17 AM | Updated on Feb 12 2024 4:28 PM

The Higher Education Council has released the schedule for both the exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి జూన్‌ 4, 5 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేసింది. మార్చి 5న నోటిఫికేషన్, 7నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆలస్య రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్‌లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం  https://icet. tsche. ac.in ను చూడవచ్చని తెలిపింది. 

మే 23న ఎడ్‌సెట్‌
రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షను మే 23న నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. మార్చి 4న నోటిఫికేషన్, మార్చి 6 నుంచి మే 13 వరకూ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించింది. పరీక్ష మే 23న ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ, సాయంత్రం 2 నుంచి 4 గంటల వరకూ ఉంటుందని పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement