సెక్రటేరియట్‌ వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల అరెస్ట్‌ | High Alert At Telangana Secretariat Area | Sakshi
Sakshi News home page

సెక్రటేరియట్‌ వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు

Jul 15 2024 11:12 AM | Updated on Jul 15 2024 1:15 PM

High Alert At Telangana Secretariat Area

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులు సెక్రటేరియట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో సోమవారం(జులై 15) సెక్రటేరియట్‌ సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. 

దీంతో సెక్రటేరియట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముట్టడికి బయలుదేరిన నిరుద్యోగులను బీఆర్కేభవన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా  డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. 

అంతకుముందు సెక్రటేరియట్‌కు వెళ్లే అన్ని దారుల్లో నిఘా పెంచారు. ముందస్తుగా నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ముట్టడికి బయలుదేరిన వారిలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోటీ పరీక్షలు వాయిదా వేయాలని రెండు రోజుల నుంచి అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement