
సాక్షి, మెదక్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల వరద పోటెత్తడంతో దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నదీపాయ పొంగిపొర్లుతోంది. దీంతో, గత 15 రోజులుగా ఆలయం వరదల్లోనే ఉంది.
వివరాల ప్రకారం.. సింగూరు ప్రాజెక్టు నుండి ఒక లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో మంజీరా నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో, గర్భగుడి మండపం పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయింది. ఏడుపాయల వద్ద పదేళ్ల తర్వాత మళ్లీ ఇంత వరద వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తోంది.
వరద తీవ్రతతో కొట్టుకుపోయిన ప్రసాదాల పంపిణీ కేంద్రం షెడ్డు సైతం కొట్టుకుపోయింది. ఇప్పటికే ఆలయానికి వెళ్లే మూడు దారులను పోలీసులు మూసివేశారు. అమ్మవారి దర్శనానికి ఎవరు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి నుంచి ఏడుపాయలకు వెళ్లే మొదటి బ్రిడ్జి వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి నుంచి వెళ్లాలని కొల్చారం పోలీసులు సూచిస్తున్నారు.
*Q Line రేకులు ఏడుపాయల లో గంట గంట కు పెరుగుతున్న వరద ఉధృతి* pic.twitter.com/TcxI0aAp1P
— Bandaram kanakaraju Bjp (@B68037Bjp) September 27, 2025