తప్పులు సరిచేయండి
ఓటరు జాబితాపై మున్సిపల్ కమిషనర్‌కు బీఆర్‌ఎస్ వినతి
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని 32 వార్డుల ఓటరు లిస్టు డ్రాప్టు జాబితాలో అనేక తప్పులున్నాయని వాటిని సవరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ కౌన్సిలర్‌లతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని శనివారం కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ న్యాయవాది జీవన్‌రావు, మాజీ కౌన్సిలర్లు అకిరెడ్డి కృష్ణారెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, గడ్డమీది కృష్ణగౌడ్, సులోచన ప్రభురెడ్డి, ఆర్కే శ్రీనివాస్, మాయ మల్లేశం, శ్రీనివాస్, ఏనుగుల రాజు, నాయకులు మెడిశెట్టి శంకర్, గోపాల్ తదితరులు ఉన్నారు.


