తొలితరం ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే
● కలెక్టర్ రాహుల్‌రాజ్ ● కలెక్టరేట్‌లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
మెదక్ కలెక్టరేట్: సమాజంలో మహిళలకు చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పిన వీర వనిత, సీ్త్రల విద్యకు కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్‌లో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అలాగే కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా కలెక్టర్ రాహుల్‌రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..మహిళలకు, ఆడబిడ్డల చదువు కోసం సావిత్రిబాయి పూలే చేసిన విశేష సేవలకు గాను ప్రతి యేటా జనవరి 3న వారి సేవలు స్మరించుకోవడం జరుగుతుందన్నారు. అలాగే అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. సమాజ చైతన్యంలో మహిళల భాగస్వామ్యాన్ని కలెక్టర్ వివరించారు. అనంతరం పలువురు మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ ,జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, జిల్లా సైన్స్‌అధికారి రాజిరెడ్డి, మహిళా ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పూలే దంపతులు ఆదర్శప్రాయులు
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్
మెదక్‌జోన్: సావిత్రి బాయి, మహాత్మా జ్యోతి బాపూలే దంపతులే ఆదర్శ ప్రాయులని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ పేర్కొన్నారు. సావిత్రి బాయిపూలే జయంతి సందర్భంగా పట్టణంలోని టీఎన్‌జీవో భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మహిళా ఉపాధ్యాయులు, అంగన్‌వాడీటీచర్లు, ఆశావర్కర్లను ఘనంగా సన్మానించారు.


