సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం తర్వాత అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ ప్రారంభమైన సమయంలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతుండగా పార్టీ ఎమ్మెల్యేలు పలుచగా ఉండడాన్ని గమనించిన ఆయన ఈ మేరకు సీరియస్ అయ్యారని సమాచారం.
‘ముఖ్యమైన అంశంపై చర్చ ప్రారంభమైన తర్వాత కూడా మన ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రాలేదు. వెంటనే వారిని సభకు రమ్మని చెప్పండి. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరూ సభలో ఉండాలి’అని ఆయన పార్టీ విప్‌లను ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంటనే సభలో లేని ఎమ్మెల్యేలందరికీ సీఎల్పీ నుంచి ఫోన్‌లు వెళ్లడంతో అందరూ సభకు వెళ్లారు.


