వినాయక నిమజ్జనంపై హైకోర్టులో జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌ | GHMC Review Petition In High Court On Vinayaka Immersion | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనంపై హైకోర్టులో జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌

Sep 13 2021 10:39 AM | Updated on Sep 13 2021 12:20 PM

GHMC Review Petition In High Court On Vinayaka Immersion - Sakshi

వినాయక నిమజ్జనంపై హైకోర్టులో జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ కోరింది. హుస్సేన్‌ సాగర్‌, ఇతర జలాశయాల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తేయాలని పిటిషన్‌లో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ట్యాంక్‌ బండ్‌ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్‌ డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

ఇవీ చదవండి:
మియాపూర్‌లో దారుణం: చిన్నారి అనుమానాస్పద మృతి
డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం

Advertisement
 
Advertisement
Advertisement