అసభ్య పోస్టులపై జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఫిర్యాదు | ghmc mayor gadwal vijayalakshmi complaints ccs police over social media posts | Sakshi
Sakshi News home page

అసభ్య పోస్టులపై జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఫిర్యాదు

Jul 9 2024 8:28 PM | Updated on Jul 9 2024 8:38 PM

ghmc mayor gadwal vijayalakshmi complaints ccs police over social media posts

హైదరాబాద్‌: సోషల్ మీడియాలో తనపై  అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారని హైదారబాద్‌ జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో  పాటు, తనను ట్రోల్స్ చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. 

ఈ మేరకు ఎక్కడెక్కడ వీడియోలు పోస్ట్ చేశారో అన్న వివరాలతో ఆమె పోలీసులకు దృష్టికి తీసుకువెళ్లారు. అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. మేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement