Hyderabad: GHMC Fined For Rs 50,000 Over Collecting Parking In Hospital Premises - Sakshi
Sakshi News home page

Banjara Hills: రూ. 20 పార్కింగ్‌ ఫీజుకు రూ. 50 వేల జరిమానా

Feb 23 2022 11:21 AM | Updated on Feb 23 2022 1:21 PM

GHMC Fined Rs 50 Thousand Collecting 20 Rupees Parking Fee in Hyderabad - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 10లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నట్లుగా సోషల్‌ యాక్టివిస్ట్‌ విజయ్‌గోపాల్‌ చేసిన ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సదరు ఆస్పత్రికి రూ. 50 వేల జరిమానా విధించింది. వివరాలివీ... ఈ నెల 15వ తేదీన రోగిని చూసేందుకు వచ్చిన సహాయకుడు తన స్కూటర్‌ను ఆ కార్పొరేట్‌ ఆస్పత్రి పార్కింగ్‌ ఆవరణలో పార్కింగ్‌ చేసి వెళ్లాడు.
చదవండి: హైదరాబాద్‌: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు

అరగంటసేపు పార్కింగ్‌లో ఉంచినందుకుగాను రూ. 20 ఫీజు వసూలు చేశారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా విజయ్‌గోపాల్‌ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ మంగళవారం ఆస్పత్రిలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేసినందుకు సదరు ఆస్పత్రికి రూ. 50 వేల జరిమానా విధిస్తూ ఈ–చలానా జారీ చేసింది.   
చదవండి: హుజుర్‌నగర్‌లో వింత కేసు.. పోలీస్‌స్టేషన్‌కు చేరిన పిల్లి పంచాయితీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement