
లష్కర్‌గూడలో విషాదం
అబ్దుల్లాపూర్‌మెట్(రంగారెడ్డి జిల్లా): ఊపిరితిత్తుల్లో వేరుశనగ కాయ ఇరుక్కోవడంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయింది. పోలీసులు, బాధి త కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడకు చెందిన బండారి శ్యామ్‌సుందర్, మహేశ్వరి దంపతుల కూతురు తన్విక (4) ఆదివారం సాయంత్రం వేరుశనగ కాయలు తింటుండగా.. ప్రమాదవశాత్తు ఓ కాయ ఊపిరితిత్తుల్లో ఇరుక్కుంది. దీంతో శ్వాస తీసుకునేందుకు చిన్నారి ఆయాస పడింది.
వెంటనే తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీయించిన వైద్యులు తని్వక ఊపిరితిత్తుల్లో వేరుశనగ కాయ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ ద్వారా తొలగించాలని సూచించడంతో తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. సోమవారం శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం 7.55 గంటల సమయంలో బాలిక మృతిచెందింది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.