దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి | Four bodies found behind a dhaba on Sagar Ring Road | Sakshi
Sakshi News home page

దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Jun 22 2026 7:15 PM | Updated on Jun 22 2026 8:33 PM

Four bodies found behind a dhaba on Sagar Ring Road

సాక్షి,నల్లగొండ: తెలంగాణ కాలనీలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.  మృతులు మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనా సహా మరో ఇద్దరు కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ప్రక్కనే ఉన్న స్థానికులకు ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ఏంటా అని ఆరా తీయగా.. మృతదేహాలు ఉన్న సంగతి తెలిసింది.

దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. అయితే మృతులలో భర్త సుల్తాన్‌ ప్రకాశం బజార్‌లో బ్యాగుల వ్యాపారం చేస్తుండగా భార్య హసీనా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. నాలుగు రోజుల క్రితమే హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిని చంపడానికి గల కారణాలు ఏంటా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement