క్యూలైన్‌లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య! | A Five-time MLA Gummadi Narsaiah Living Simple Life, Waiting In Queue Line At Hospital | Sakshi
Sakshi News home page

క్యూలైన్‌లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య!

Nov 14 2024 7:30 AM | Updated on Nov 14 2024 1:08 PM

A five-time MLA waiting to Queue line in Hospital

సాధారణ వ్యక్తి మాదిరిగా కంటి పరీక్షలు

పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్‌పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. 

ఇదే క్రమాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన వచ్చారు. అక్కడ అందరితోపాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక పరీక్ష చేయించుకున్నారు. వార్డుమెంబర్, ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు.

చ‌ద‌వండి: హీరో ప్రభాస్‌ హెయిర్‌ స్టైల్‌ కావాలి.. ఫ్లాట్‌ హెయిర్‌ కట్‌ వ‌ద్దు  

Advertisement
 
Advertisement
Advertisement