మణుగూరు రూరల్: మణుగూరు ఏరియాకు నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సమష్టి కృషితో సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ సూచించారు. శుక్రవారం ఆయన ఓసీ–2, ఓసీ–4 వ్యూపాయింట్లను, కోల్ బెంచ్, డంపర్ సెక్షన్లను సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, భారీ యంత్రాల పనితీరు, రవాణా కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు. అధికారులు దుర్గం రామచందర్, బి. శ్రీనివాసచారి, ఎల్.దయాకర్, డి.రమణారెడ్డి, సురేష్, సర్వర్ నబీ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ


