చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు క్రిబ్కో కంపెనీకి చెందిన 1,319.40 మెట్రిక్ టన్నుల యూరియా శుక్రవారం చేరింది. ఈ మేరకు కోటా వారీగా ఖమ్మం జిల్లాకు 519.40 మె. టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 500 మె. టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 200 మె. టన్నులు సరఫరా చేశామని ఖమ్మం డీఏఓ డి.పుల్లయ్య తెలిపారు. మరో 100 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.
శ్రీనిధి బకాయిలు
వంద శాతం రికవరీ
కామేపల్లి: మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న శ్రీనిధి రుణాలను వంద శాతం వసూలు చేసేలా అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని శ్రీనిధి రీజనల్ మేనేజర్ రవీందర్‌నాయక్ సూచించారు. కామేపల్లిలోని అజంతా మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శ్రీనిధి రుణాలు, వసూళ్లపై శుక్రవారం ఆయన సమీ క్షించారు. సభ్యుల పురోగతికి తోడ్పడుతున్న శ్రీనిధి రుణాల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కు వ బకాయిలు ఉన్న ప్రాంతాలపై కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిసెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సంఘాల వారీగా బకాయిలను పరిశీలిస్తూ సభ్యులతో మాట్లాడి సకాలంలో చెల్లించేలా చైతన్యపరుస్తూ వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆర్ఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటరామారావు, వీఓఏ, సీసీలు పాల్గొన్నారు.


