నేటితో ముగియనున్న తొలివిడత నామినేషన్లు | The first phase of nominations for the Gram Panchayat elections will end today | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న తొలివిడత నామినేషన్లు

Nov 29 2025 4:04 AM | Updated on Dec 4 2025 11:40 AM

The first phase of nominations for the Gram Panchayat elections will end today

డిసెంబర్‌ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఆదివారం నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం ద్వారా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆ రోజు సాయంత్రం 5 తర్వాత నామినేషన్ల స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. 

సర్పంచ్‌/వార్డు మెంబర్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైన పక్షంలో సదరు అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ / సబ్‌ కలెక్టర్‌ వద్ద రిటర్నింగ్‌ అధికారి నిర్ణయంపై అప్పీలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ మరుసటి రోజు నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. అప్పీలు దాఖలు చేసిన మరుసటి రోజే ఆ అప్పీలును సంబంధిత అధికారి పరిష్కరిస్తారు. 

అసంపూర్తి సమాచారం, అవసరమైన పత్రాలు జతచేయకపోవడం, ఆయా అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు జోడించని కారణంగా గతంలో పలువురు సర్పంచ్, వార్డు మెంబర్‌ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ గురైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలనకు ప్రాధాన్యం ఏర్పడింది. 

నామినేషన్ల తిరస్కరణ అవకాశాలు తగ్గించుకునేందుకు వీలుగా నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థులు వివిధ డాక్యుమెంట్లు తమ వద్దే ఉంచుకుంటే శ్రేయస్కరమని అధికారులు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల లోపు అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న సర్పంచ్‌ /వార్డుల అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు.  

ఇవి తప్పనిసరి ఉండాల్సిందే... 
» గ్రామ పంచాయతీ తాజా ఓటరు జాబితా లేదా అభ్యర్థి, ప్రతిపాదకుడు (ప్రపోజర్‌) పేరు ఓటరు జాబితాలో రికార్డయినట్టుగా జారీ చేసిన సర్టిఫికెట్‌  
» అభ్యర్థి వయసు ధ్రువీకరణకు సంబంధించిన ఆధారం 
» డిపాజిట్‌ చెల్లింపునకు సంబంధించిన రశీదు  
» నామినేషన్‌ పత్రం సమరి్పంచినట్టుగా రిటరి్నంగ్‌ అధికారి నుంచి పొందిన రశీదు 
» ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు రిజర్వ్‌ అయిన సీట్లలో పోటీ చేసేవారు ఆయా కేటగిరీలకు చెందినవారిగా ఆధారాలు చూపాలి 

నామినేషన్‌ తిరస్కరణకు ముఖ్య కారణాలివే... 
» నిర్దేశిత ఫార్మాట్‌ ప్రకారం నామినేషన్‌ పత్రం లేకపోతే 
» నామినేషన్‌లో సంతకాల కోసం కేటాయించిన చోట అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు లేదా ఇద్దరూ సంతకాలు చేయకపోడం
» చట్ట ప్రకారం నిర్దేశిత డిపాజిట్‌ మొత్తాన్ని చెల్లించకపోతే 
»  నామినేషన్‌ పత్రంపై అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు చేసిన సంతకం సరైనది కాకపోతే 
» ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయించిన స్థానాల్లో నామినేషన్‌ దాఖలు చేసినా, సంబంధిత రిజర్వేషన్‌కు చెందినవారు కాకపోతే లేదా మహిళల కోసం రిజర్వ్‌ చేసిన స్థానాల్లో నామినేషన్‌ దాఖలు చేస్తే.. 
» వార్డు మెంబర్‌ అభ్యర్థి ప్రపోజర్‌ సంబంధిత వార్డులో ఓటరుగా నమోదు కాకపోతే... 
» నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఈసీ నిర్దేశిత నమూనాలో ఇద్దరు సాక్షుల ధ్రువీకరణలతోపాటు డిక్లరేషన్‌ పత్రాన్ని అభ్యర్థి సమర్పించకపోతే నామినేషన్లను సంబంధిత అధికారులు తిరస్కరిస్తారు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement