
జనగామ జిల్లా: పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో జనగామ జిల్లా కొడ కండ్ల మండలం నీలి బండ తండాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గుగులోత్ నీల (26) ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుగులోత్ హేమ, చిన్ని దంపతుల రెండో కుమార్తె నీల 2020లో ఏఆర్ కానిస్టే బుల్‌గా ఎంపికై వరంగల్‌లో పనిచేస్తోంది.
శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన నీల.. ఎవరూ లేని సమయంలో ప్యాన్‌కు ఊరి వేసుకుంది. పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో తన కూతురు ఆత్మహత్య చేసు కుందని మృతురాలి తల్లి చిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చింత రాజు తెలిపారు.
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఆదివారం ఓ గర్భిణికి ముగ్గురు శిశువులు జన్మించారు. తల్లితో పాటు ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లికి చెందిన కొడెండ్ల సృజనకు ఆదివారం పురిటినొప్పులు రాగా.. మండల కేంద్రంలోని శ్రీతిరుమల నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు స్రవంతి, శ్రీకాంత్‌లు.. సృజన గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నట్లు గుర్తించి.. వెంటనే శస్త్రచికిత్స చేశారు. సృజన ఇద్దరు ఆడ శిశువులు, ఒక మగ శిశువుకు జన్మనిచ్చారు. ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ 15వేల మంది గర్భిణుల్లో.. ఇలా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మిస్తారని తెలిపారు.