అప్పుల బాధ తాళలేక..  | Farmer Commits Suicide Drinking Insecticide Due To Debt In Kamareddy District | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక.. 

Nov 9 2021 1:49 AM | Updated on Nov 9 2021 1:49 AM

Farmer Commits Suicide Drinking Insecticide Due To Debt In Kamareddy District - Sakshi

సింగం శంకర్‌ (ఫైల్‌) 

బాన్సువాడ రూరల్‌: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసు కున్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మం డలం హన్మాజీపేట్‌ గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సింగం శంకర్‌ (52) ఇటీవలే వరి పంట కోసి తన పొలం పక్కనే ఆరబె ట్టాడు.

ఆదివారం రాత్రి ధాన్యం కాపలా కో సం ఇంటి నుంచి వెళ్లిన అతడు.. సోమవారం తెల్లవారు జామున పురుగు ల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ధాన్యం కుప్పపై విగతజీవిగా పడిఉన్న శంకర్‌ను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పంటలు పండక నష్టాలు వచ్చి అప్పులు పెరిగి పోయాయని మృతుడి భార్య లక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement