ఛీ.. వీడేం టీచర్‌.. టెన్త్‌ నుంచి వేధింపులు.. పెళ్లి తర్వాత.. | English Teacher Sentenced To 17 Years In Prison After Woman Filed Complaint On Him In Karimnagar | Sakshi
Sakshi News home page

ఛీ.. వీడేం టీచర్‌.. టెన్త్‌ నుంచి వేధింపులు.. పెళ్లి తర్వాత..

Jun 27 2025 7:53 AM | Updated on Jun 27 2025 9:01 AM

English teacher sentenced to 17 years in prison

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో చదివే బా లికను వేధించి, లోబర్చుకొని శారీరకంగా వాడుకున్న ఇంగ్లిష్‌ టీచర్‌ సాతూరి మధుకర్‌(52)కు 17 ఏళ్ల కారాగార శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ జడ్జి సునీత తీర్పు చెప్పారు. ఎస్సై వెంకటేశ్‌ తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉండే మధుకర్‌ 2013లో కాల్వశ్రీరాంపూర్‌ స్కూల్‌లో ఇంగ్లిష్‌ టీచర్‌గా పని చేశాడు. ఆ సమయంలో 10వ తరగతి బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, బలవంతంగా లో బర్చుకున్నాడు. 

రాత్రి క్లాస్‌ల పేరిట స్కూల్‌కు పిలిచి స్టాఫ్‌ రూమ్‌లో చాలాసార్లు శారీరకంగా అనుభవించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నను చంపేస్తానని బెదిరించాడు. తర్వాత బాలిక హనుమకొండలో డిగ్రీ చదువుతున్న సమయంలో మధుకర్‌ అక్కడి కూడా వెళ్లి ఆమెను భయపెట్టి శారీరకంగా వాడుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. తాను పిలిచినప్పుడల్లా రాకుంటే ఫొటోలు, వీడియోలు అందరికీ పంపిస్తానని బెదిరించాడు. 

అనంతరం ఆమెకు పెళ్లయినా వదిలిపెట్టలేదు. ఆమె భర్తకు ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు పంపించాడు. అవి చూసిన ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై ఎస్‌కే జానీపాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు పంపించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బాదం రమేశ్‌ సాక్షులను ప్రవేశపెట్టి తన వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేయడంలో కీలకపాత్ర పోషించారు. జడ్జి సునీత సాక్ష్యాధారాలు పరిశీలించి నిందితుడికి కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement