నేటితో ముగియనున్న నుమాయిష్ ఎక్సిబిషన్ | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న నుమాయిష్ ఎక్సిబిషన్

Published Sun, Feb 18 2024 9:12 AM

End Of Numaish Exhibition Hyderabad - Sakshi

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌) ఆదివారం ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ప్రతి యేట జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు. ఈ సారి స్టాల్‌ హోల్డర్స్‌ విజ్ఞప్తి మేరకు నుమాయిష్‌ను మూడు రోజులు పెంచుతున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రకటించారు. దీంతో 18వ తేదీన నుమాయిష్‌ ముగియనుంది.

Advertisement
 
Advertisement