గణేష్‌ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో.. | Sakshi
Sakshi News home page

గణేష్‌ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో..

Published Thu, Sep 28 2023 8:38 AM

DJ In Ganesh Nimajjanam: Man Died Of Heart Attack While Dancing - Sakshi

సాక్షి, ఖమ్మం​: పెనుబల్లి మండలం పాత కారాయిగూడెంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనంలో డ్యాన్స్‌ చేస్తూ దూదిపాళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ ఒక్కసారిగా  కుప్పకూలిపోయాడు.

వైద్యం కోసం తిరువూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement
 
Advertisement