శెభాష్‌..ఆశా మాలవీయా..! | DGP Anjani Kumar congratulated the cyclist | Sakshi
Sakshi News home page

శెభాష్‌..ఆశా మాలవీయా..!

Feb 11 2023 3:50 AM | Updated on Feb 11 2023 10:40 AM

DGP Anjani Kumar congratulated the cyclist - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహిళా భద్రతపై యువతలో సానుకూల దృక్పథం కల్పించడంతోపాటు డ్రగ్స్‌కు నో చెప్పండి అంటూ యువతలో సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు దేశవ్యాప్తంగా సైకిల్‌యాత్ర చేస్తున్న సైక్లిస్ట్‌ ఆశా మాలవీయాను డీజీపీ అంజనీకుమార్‌ అభినందించారు.

ఈ మేరకు శుక్రవారం తన చాంబర్‌లో తెలంగాణ పోలీస్‌ జ్ఞాపికను అందించి అభినందించారు. ‘మహిళల భద్రత, డ్రగ్స్‌పై సందేశం వ్యాప్తి చేసేందుకు సైకిల్‌పై ఆశా మాల్వియా భారతదేశం మొత్తం యాత్ర చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమెకు మేమంతా సెల్యూట్‌ చేస్తున్నాం’అని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్‌ ఐజీ తరుణ్‌జోషి పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement