యాదాద్రీశుడి దర్శనానికి 3 గంటలు | Devotees Crowd Increased In Yadadri Lakshmi Narasimha Swamy Temple | Sakshi
Sakshi News home page

యాదాద్రీశుడి దర్శనానికి 3 గంటలు

Dec 13 2021 2:34 AM | Updated on Dec 13 2021 2:34 AM

Devotees Crowd Increased In Yadadri Lakshmi Narasimha Swamy Temple - Sakshi

యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ 

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో రెండు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం, ఆదివారం సెలవు రోజులు కలసి రావడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ వీధులు, క్యూలైన్లు, బాలాలయం, ఉత్సవ, మహా మండపాలు, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, ప్రసాద విక్ర య కేంద్రం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.

రద్దీ ఎక్కువగా ఉండడంతో ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటలు, అతి శీఘ్ర దర్శనానికి సుమారు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆదివారం 30 వేలకు పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో కొండపైకి భక్తుల వాహనాలు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పాతగుట్టపై కూడా భక్తుల రద్దీ కొనసాగింది.

Advertisement
 
Advertisement
Advertisement