
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చిత్రంలో బండారు దత్తాత్రేయ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మహేశ్‌కుమార్‌గౌడ్, వాకిటి శ్రీహరి, కేవీపీ తదితరులు
కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ 96వ జయంతి
వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి, శ్రీధర్‌బాబు, పొన్నం, వాకిటి
గన్‌పౌండ్రీ: దేశంలో బడుగు, బలహీనవర్గాలు సహా అన్ని వర్గాలకూ న్యాయం చేయాలని రాహు ల్ గాంధీ చేస్తున్న ప్రయత్నానికి అందరూ మద్దతివ్వాల్సిన అవసరం ఎంతో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. శివశంకర్ దేశంలోనే ఉన్నత స్థితికి చేరుకున్నారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజ లు, గిరిజనులు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సామాజిక రుగ్మతలపై ఆనాడే ఆయన పోరాడారని.. కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు.
42% రిజర్వేషన్ల పోరుకు ఆయనే స్ఫూర్తి: మంత్రులు ఉత్తమ్, వాకిటి
బీసీల గురించి గతంలోనే పోరాడిన యోధుడు శివశంకర్ అని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తాము చేస్తున్న పోరాటానికి ఆయనే స్ఫూర్తి అని పేర్కొన్నారు. త్వరలో ఆయన స్మారక చిహ్నం, విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని ప్రకటించారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలియజేశారు. శివశంకర్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.
మాజీ గవర్నర్ బండ్డారు దత్తాత్రేయ మాట్లాడుతూ విద్య ఉంటేనే ఉన్నత స్థానాలకు ఎదగవచ్చని శివశంకర్ ఆయన జీవితంతో సమాజానికి తెలియజేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కీ గౌడ్, సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్, కార్పొరేషన్ల చైర్మన్లు నూతి శ్రీకాంత్‌గౌడ్, అనిల్, సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ వినయ్‌కుమార్, దళిత ఉద్యమ జాతీయ నాయకుడు జె.బి. రాజు తదితరులు పాల్గొన్నారు.