తెలివిమీరిన సైబర్ నేరగాళ్లు.. ఎమ్మెల్యే పేరుతో డబ్బులు వసూలు | Cyber Criminals Scams By Using Mla Veeresham Name | Sakshi
Sakshi News home page

తెలివిమీరిన సైబర్ నేరగాళ్లు.. ఎమ్మెల్యే పేరుతో డబ్బులు వసూలు

Oct 2 2024 9:09 AM | Updated on Oct 2 2024 10:01 AM

Cyber Criminals Scams By Using Mla Veeresham Name

నల్లగొండ జిల్లా :సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమో మరోసారి వెలుగు చూసింది.

ఈసారి సైబర్‌ నేరగాళ్ల అమాయకుల్ని మోసం చేసేందుకు ప్రజా ప్రతినిధుల్ని ఎంచుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యుల పేరుతో సైబర్ నేరగాళ్ల వాట్సాప్ కాల్స్‌ చేశారు.

ఎమ్మెల్యే వేముల వీరేశం పేరుతో డబ్బులు కావాలంటూ ఆయన సన్నిహితులకు మెసేజ్, వాట్సాప్ కాల్స్‌ చేశారు. సైబర్‌ కేటుగాళ్ల గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వీరేశం తన పేరుతో మెసేజ్‌లు,కాల్స్‌ వస్తున్నాయని,అలాంటి వాటికి స్పందించొద్దని కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement