ఇరాన్‌ ఫ్రీజింగ్ ఆస్తులు.. మసూద్‌ పెజెష్కియన్ కీలక ప్రకటన | great victory iran says qatar to release 6bn in frozen assets contradicts trumps claims | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ ఫ్రీజింగ్ ఆస్తులు.. మసూద్‌ పెజెష్కియన్ కీలక ప్రకటన

Jun 29 2026 7:40 PM | Updated on Jun 29 2026 9:13 PM

great victory iran says qatar to release 6bn in frozen assets contradicts trumps claims

టెహ్రాన్‌ : ఇరాన్‌ ప్రజలకు ఆదేశ అధ్యక్షుడు మసూజ్ పెజెష్కియన్ శుభవార్త చెప్పాడు. ఆ దేశానికి చెందిన ఆరు బిలియన్‌ డాలర్లను విడుదల చేయడానికి ఖతార్ అంగీకరించిందని పేర్కొన్నారు. త్వరలోనే ఆ డబ్బు విడుదల కానుందని పేర్కొన్నారు.అయితే అమెరికా మాత్రం  స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులేవీ విడుదల  చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

గత కొంత కాలంగా ఇరాన్‌- అమెరికా చర్చలు సజావుగా సాగకపోవడానికి స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులు సైతం ఓ కారణం విదేశాల్లో ఫ్రీజ్‌ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఇరాన్ పట్టుబట్టడం దానికి అమెరికా ససేమిరా అనడంతో చర్చల వ్యవహారం ఎంత మాత్రం ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు సైతం నిధులు విడుదల చేసేది లేదన్నారు.

అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ ఫెజెష్కియన్‌ మాత్రం దానికి విభిన్నంగా మాట్లాడారు “ ఇటీవలే రూపొందించిన ప్రణాళికల ప్రకారం, ఖతార్‌లోని మొత్తం 12 బిలియన్ డాలర్ల ఇరాన్ నిధులలో ఆరు బిలియన్ డాలర్లను వెంటనే  విడుదల చేసి దేశానికి తిరిగి ఇవ్వనున్నారు, అంతే కాకుండా తదనంతరం అవసరమైన తదుపరి చర్యలు చేపడుతారు.” అని అన్నారు.

 అయితే ఈ యుద్ధ ఉద్రిక్తతల వేళ చర్చల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ 'నిస్సహాయతతో' చర్చల్లోకి ప్రవేశించిందని, 60 రోజుల చర్చల కాలంలో టెహ్రాన్‌కు ' పది సెంట్లు కూడా ' అందవని తేల్చి చెప్పారు. అదే విధంగా ఈ యుద్ధంలో ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, వాయు, రక్షణ వ్యవస్థలు భారీ స్థాయిలో డ్యామేజ్‌ అయ్యాయని పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement