వామ్మో.. రూ.21.47 కోట్ల కరెంట్‌ బిల్లు.. | Current bill of Rs 21 crore in Nagarkurnool | Sakshi
Sakshi News home page

వామ్మో.. రూ.21.47 కోట్ల కరెంట్‌ బిల్లు..

Jun 13 2024 5:22 AM | Updated on Jun 13 2024 5:22 AM

Current bill of Rs 21 crore in Nagarkurnool

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఓ వ్యక్తికి వచ్చిన బిల్లు ఇది.. 

తర్వాత సరిచేసిన విద్యుత్‌ అధికారులు  

బిజినేపల్లి: గ్రామజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఓ వైపు వినియోగదారులకు జీరో బిల్లు ఇస్తుంటే.. మరోవైపు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఓ సాధారణ వ్యక్తికి విద్యుత్‌ సిబ్బంది రూ.కోట్లలో బిల్లు ఇచ్చి షాకిచ్చారు. సాధారణంగా ఓ వినియోగదారునికి కరెంట్‌ బిల్లు నెలకు రూ.500 వరకు వస్తుంది. 

ఏసీ, ఫ్రిడ్జ్, గీజర్‌ వంటి వస్తువులు వాడితే.. రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వస్తుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌కు చెందిన వేమారెడ్డికి ప్రతీ నెల రూ.వందల్లో బిల్లు వచ్చేది. ఈ క్రమంలో ఈ నెల 7న విద్యుత్‌ అధికారులు వేమారెడ్డి ఇంట్లో కరెంట్‌ మీటర్‌ స్కాన్‌ చేసి రూ.21,47,48,569 చెల్లించాల్సిందిగా బిల్లు ఇచ్చి వెళ్లారు.

ఆలస్యంగా ఆ బిల్లు చూసుకున్న వేమారెడ్డికి ఒక్కసారి షాక్‌ కొట్టిన ట్లు అయింది. తమకు సాధా రణంగా రూ.వందల్లో రావాల్సిన బిల్లు రూ.కోట్లలో రావడం ఏమిటని ఆందోళన చెందుతూ ఆయన విద్యుత్‌ శాఖ అధికారులను ఆశ్రయించారు. దీనిపై ఏఈ మహేశ్‌ను వివరణ కోరగా జీరో బిల్లు చేసే సమయంలో అలా వచ్చిందని.. తిరిగి రీఎంట్రీ చేయడం ద్వారా మళ్లీ సాధారణంగా వచ్చి0దని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement