కందనూలు: జిల్లాలో మాదకద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగంపై సంబంధిత శాఖలు నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో సమాచార మార్పిడి, సమన్వయం మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసు, విద్య, వైద్య, ఎకై ్సజ్ తదితర శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయం పెంచుకుంటూ పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని, డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ ఎరువులు విక్రయించొద్దు
జిల్లాలోని నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. రైతులను మోసం చేస్తూ నకిలీ ఎరువుల తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడే వ్యక్తులు, ముఠాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల నకిలీ డీఏపీ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బిజినేపల్లి, తిమ్మాజిపేట, తాడూ రు, కల్వకుర్తి మండలాల్లో 872 డీఏపీ ఎరువుల బ్యా గులు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామ న్నారు. ఈ వ్యవహారంలో మొత్తం తొమ్మిది మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. ఏడుగురిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకునేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయన్నారు. జిల్లాలో రైతులు సైతం ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను లైసెన్స్‌డు డీలర్లు, పీఏసీఎస్‌లు, ఇతరత్రా అధికారిక విక్రయ కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాలని సూచించారు.


