టీబీ వ్యాధిని మొదట్లోనే గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

టీబీ వ్యాధిని మొదట్లోనే గుర్తించాలి

Aug 5 2026 2:05 AM | Updated on Aug 5 2026 2:05 AM

కందనూలు: క్షయ వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి వెంటనే చికిత్స అందించాలని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ మండలంలోని పెద్దముద్దునూరు పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన క్షయవ్యాధి పరీక్ష శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, ఆకలి, బరువు తగ్గడం, సాయంత్రం జ్వరం రావడం, దగ్గినప్పుడు కళ్లెలో రక్తం పడడం తదితర లక్షణాలు ఉన్నవారు డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని చెప్పారు. క్షయవ్యాధిగ్రస్తులు మాంసకృతులతో కూడిన పౌష్టికాహారాన్ని తినడానికి ప్రతినెల వారి అకౌంట్లో రూ.వెయ్యి జమ అవుతాయని పేర్కొన్నారు.

సలహాదారుల

ఎంపికకు ఇంటర్వ్యూలు

మన్ననూర్‌: జిల్లాలో వెయ్యి మంది సలహాదారుల (గైడ్స్‌) ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని తెలంగాణ సామూహిక జీవనోపాదుల సంస్థ (టీజీఐఎంసీ) స్టేట్‌ కోఆర్డినేటర్‌ జయరాం తెలిపారు. మంగళవారం ఆయన మన్ననూర్‌లోని మండల గిరిజన మహిళా సమాఖ్య భవనంలో 30 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి మాట్లాడారు. ఉమ్మడి అమ్రాబాద్‌ మండలంలో మహిళా సమాఖ్యలు కొనసాగుతున్న ఒక్కో గ్రామానికి ముగ్గురు గైడ్స్‌ చొప్పున నియమించడం జరుగుతుందన్నారు. ఈ పథకం పైలెట్‌ ప్రాజెక్టుగా 24 నెలల కాలపరిమితిగా కొనసాగుతుందన్నారు. ఇప్పటికే పరిమిత సంఖ్యలో కొందరు సలహాదారులతో 12 నెలలు పూర్తయిన క్రమంలో కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. సమాఖ్యలకు గైడ్స్‌గా ఎంపికై న వారికి ఎలాంటి జీతభత్యాలు ఉండవని, భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలు, ఉద్యోగావకాశాల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ అధికారుల తనిఖీలు

కందనూలు: జిల్లాకేంద్రంలోని పలు దుకాణా ల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు సీటీఓ కృష్ణవర్ధన్‌రెడ్డి తెలిపారు. సీటీఓ కథనం ప్రకారం వివరాలిలా.. పట్టణంలోని బంగారం, వస్త్ర దుకాణాలతోపాటు రైస్‌మిల్లు ల్లో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించార న్నారు. ఓ బంగారు దుకాణానికి స్థల మార్పిడి సమాచారం లేనందున రూ.20 వేల జరిమానా విధించారు. అలాగే 2 వస్త్ర దుకాణాలకు నోటీసులు ఇచ్చారు. ఒక రైస్‌మిల్లుకు రూ.25 లక్షల పాత బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చామన్నారు. ప్రతి షాపు యజమాని జీఎస్టీ పరిధిలో వ్యాపారం నిర్వహించాలని, ఉల్లంఘనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement