కలెక్టర్ ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్ల రద్దు చేసి నియామకమైన పాఠశాలలకు పంపించాం. అందరు ఉపాధ్యాయలు విధుల్లో చేరారు. అయితే కొన్నిచోట్ల విద్యార్థులు లేని కారణంగా ఏజెన్సీలోనే వీరిని సర్దుబాటు చేస్తూ పిల్లలు ఉన్న పాఠశాలలకు పంపిస్తున్నాం. దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిన ఉపాధ్యాయుల స్థానంలో వీరిని నియమిస్తున్నాం. మైదాన ప్రాంతాలకు ఎవరినీ తీసుకోవడం లేదు. – రమేష్‌కుమార్, డీఈఓ
మరో టీచర్‌ను పంపించాలి.
మా ఊరిలోని పాఠశాలకు ఇద్దరు టీచర్లే వస్తున్నారు. 43 మంది పిల్లలకు చదువు ఎలా చెప్తారు. మరో టీచర్ డిప్యూటేషన్‌పై వెళ్లారు. వచ్చినా పాఠశాలకు రావడం లేదు. మరోచోటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయులు సక్రమంగా వచ్చేలా చూడటంతోపాటు అదనంగా మరొకరిని నియమించాలి.
– మోహన్, విద్యార్థి తండ్రి, తిరుమలాపూర్(బీకే)
సిద్దాపూర్‌కు వెళ్తున్నారు..
మా ఊరి పాఠశాలకు ఉపాధ్యాయులు లేక పిల్లలు సిద్దాపూర్‌కు వెళ్లి చదువుతున్నారు. పిల్లలు వచ్చిపోయేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుడిని నియమించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి కూ డా తీసుకెళ్లాం. ఇప్పటికై నా పోస్టును భర్తీ చేయాలి.
– రవీందర్, సర్పంచ్, పద్మారంతండా
పాఠశాలలు తెరిపించాలి..
ఏజెన్సీ ప్రాంతాల్లో మూతబడిన అన్ని పాఠశాలను అధికారులు తెరిపించాలి. తండాలో పాఠశాల లేక విద్యార్థులను వివిధ ప్రాంతాలకు పంపించాల్సి వస్తుంది. ఉపాధ్యాయ పోస్టు ఉన్న సక్రమంగా వారు రాక పాఠశాలను మూసివేస్తున్నారు. వెంటనే ఉపాధ్యాయుడిని రప్పించి పాఠశాలలను తెరిపించాలి.
– సబావత్ భాస్కర్, చీన్యాతండా
●


