హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నాం: సీపీఐ నారాయణ | Cpi Narayana Welcomed Hydra Demolitions | Sakshi
Sakshi News home page

హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నాం: సీపీఐ నారాయణ

Aug 25 2024 6:37 PM | Updated on Aug 25 2024 6:47 PM

Cpi Narayana Welcomed Hydra Demolitions

సాక్షి హైదరాబాద్‌: హైడ్రా కూల్చివేతలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలన్నారు. ఆదివారం ఆయన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెరువులో కాలేజీలు నిర్మించారని వారి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్‌ చేశారు.

చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే గ్రామాలు మునిగిపోతాయని నారాయణ అన్నారు. ఆరంభ శూరత్వంగా మిగిలిపోకూడదు.. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలన్నారు. కబ్జాలు పాల్పడిన వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు జరపాలన్నారు. ఎంఐఎం నేతలవి కూడా తొలగించాలన్న నారాయణ.. మేం మొదటి నుంచి భూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement