హైదరాబాద్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కార్ల బీభత్సం! భారీగా ట్రాఫిక్‌ జామ్‌! | Rajendranagar PV Expressway Road Accident In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కార్ల బీభత్సం! భారీగా ట్రాఫిక్‌ జామ్‌!

Oct 16 2026 9:57 AM | Updated on Oct 16 2026 10:12 AM

Rajendranagar PV Expressway Road Accident In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పరపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు అప్రమత్తమయ్యారు. అయితే, వరుసగా కార్లు ఢీకొనడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈ ప్రమాదం కారణంగా పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, రద్దీ కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే, ప్రమాదానికి గల అసలు కారాణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: పిల్లల్ని మాట్లాడనివ్వాలి.. అప్పుడే ఇలాంటివి బయటపడతాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement