హైదరాబాద్‌ నడిబొడ్డున 35 అంతస్తుల భవనమా? | Telangana HC: How did 35 floor tower get nod near Moazzam Jahi Market | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నడిబొడ్డున 35 అంతస్తుల భవనమా?

Oct 15 2026 7:18 PM | Updated on Oct 15 2026 7:25 PM

Telangana HC: How did 35 floor tower get nod near Moazzam Jahi Market

‘మీనాక్షి ఎలీసియా’కు అనుమతిపై హైకోర్టు ఆశ్చర్యం

సాక్షి, హైదరాబాద్‌: నగరం నడిబొడ్డున 35 అంతస్తుల భారీ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై తెలంగాణ‌ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చారిత్రక మొజంజాహీ మార్కెట్‌కు సమీపంలోని అబిడ్స్‌ గన్‌ఫౌండ్రిలో చేపట్టిన ‘మీనాక్షి ఎలీసియా’కు అనుమతుల మంజూరు ప్రక్రియను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయా లని ప్రతివాదులైన అధికారులతో పాటు మీనాక్షి సంస్థను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

నగరం నడిబొడ్డున భారీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ సొసైటీ ఫర్‌ క్రూసేడ్‌ ఎగైనెస్ట్‌ కరప్షన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టప్రకారం అనుసరించాల్సిన విధివిధానాలను పాటించకుండా, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించకుండానే జీహెచ్‌ఎంసీ అనుమతులు మంజూరు చేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్‌ దాఖలు చేయా లని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.

ఇదీ చ‌ద‌వండి: ఎన్‌హెచ్‌ 563పై ఇక టోల్‌ వలుచుడే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement