ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు | Cm Revanth Reddy Birthday Celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

Nov 8 2024 8:08 PM | Updated on Nov 8 2024 8:19 PM

Cm Revanth Reddy Birthday Celebrations

సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.11లో ఘనంగా జరిగాయి.

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.11లో ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్‌ డీసీసీ ఉపాధ్యక్షుడు కొప్పిసెట్టి గోవింద్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణా సంచా కాల్చి, భారీ కేక్‌ను కట్‌ చేశారు.

అనంతరం గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శులు ముంజగళ్ళ విజయ్‌కుమార్, మచ్చ విజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు, రైతులకు రుణమాఫీ దిగ్విజయంగా జరిగిందన్నారు. పుట్టిన రోజు నాడు కూడా సీఎం ప్రజాక్షేత్రంలోనే ఉండాలలనే సంకల్పంతో మూసి పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తుండటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు భీమ్‌రావు, నజీర్, రమణ, అప్పారావు, పూల్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement