గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించా: సీఎం కేసీఆర్‌ | CM KCR Attend Swatantra Bharat Vajrotsavam Closing Ceremony At HICC - Sakshi
Sakshi News home page

స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు.. హాజరైన సీఎం కేసీఆర్‌

Sep 1 2023 3:23 PM | Updated on Sep 1 2023 6:36 PM

Cm KCr Attend Swatantra Bharat Vajrotsavam Closing Ceremony At HICC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను శుక్రవారం హెచ్‌ఐసీసీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్‌ హాజరై.. జాతీయ జెండా ఎగురవేశారు.  అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. గాంధీ సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. గాంధీ సూచనలతో భారత రాజ్యాంగం రూపకల్పన జరిగిందని తెలిపారు.

గాంధీ మతోన్మాద శక్తుల చేతిలో దుర్మరణం చెందడం ఎంతో బాధాకరమని సీఎం అన్నారు. ఆయన మార్గంలోనే తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని తెలిపారు. అహింసా మార్గంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానని చెప్పారు. తెలంగాణకు సహకరించని వాళ్ళు నేడు తెలంగాణ ఉద్యమ పాఠాలు చెప్తున్నారని విమర్శించారు.  
చదవండి: బీఆర్‌ఎస్‌లో రసవత్తర రాజకీయం.. కందులకు కవిత అభయహస్తం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement