తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి | Chiranjeevulu Speech on BC Movement | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి

Jun 14 2026 10:33 PM | Updated on Jun 14 2026 10:33 PM

Chiranjeevulu Speech on BC Movement

హైదరాబాద్ , జూన్ 14 : హైదరాబాద్‌లోని బాగలింగంపల్లి లొ గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (BCI) విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈసమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్ లో వాటా,రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా “హిస్సా – ఇజ్జత్ – హుకూమత్” నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక , సాంస్కృతిక అన్యాయాలను ఆయన వివరించారు. బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని, రాజ్యాధికారం లేకుండా ఏ సమాజమైనా తన అస్తిత్వాన్ని, అభివృద్ధిని కాపాడుకోలేదని అన్నారు.

ఈ సమావేశానికి కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి తదితరులు పాల్గొని బీసీ ఉద్యమ దిశ, దశ, భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన కమిటీల సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్లుగా చెన్న శ్రీకాంత్, అవ్వారు వేణు, ఎర్రమాడ వెంకన్న, లింగేష్ యాదవ్‌లకు నియామక పత్రాలు ప్రదానం చేశారు. అదేవిధంగా  prof బెనర్జీ ని రాష్ట్ర వైస్ చైర్మన్ గా ,prof విజయ్ బాబు ను పొలిటికల్ అడ్వైజర్ గా నియామక పత్రాలు అందజేశారు.

సమావేశంలో బీసీ ఉద్యమ విస్తరణ, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, భావజాల ప్రచారం, శిక్షణా కార్యక్రమాలు మరియు రాబోయే కాలంలో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

– విడుదలకర్త
బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (BCI)
తెలంగాణ రాష్ట్ర కమిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement