టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన చేవేళ్ల ఎమ్మెల్యే  | Chevella MLA Who Met TTD Chairman YV Subba Reddy | Sakshi
Sakshi News home page

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన చేవేళ్ల ఎమ్మెల్యే 

Nov 4 2021 11:31 AM | Updated on Nov 4 2021 12:41 PM

Chevella MLA Who Met TTD Chairman YV Subba Reddy - Sakshi

వై.వి. సుబ్బారెడ్డితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య 

సాక్షి, చేవెళ్ల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైవీ సుబ్బారెడ్డిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో బుధవారం టీటీడీ చైర్మన్‌ ఇంట్లో ఆయను కలిసిన ఎమ్మెల్యే పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు. తన నియోజకవర్గంలోని నవాబుపేట మండలంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి కృషి చేయాలని టీటీడీ చైర్మన్‌ను కోరినట్లు వివరించారు. అలాగే నియోజకవర్గంలో పలు ఆలయాల జీర్ణోద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తప్పకుండా మండపం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement