24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్‌, హరీశ్‌ విజయంపై కూడా

Challenge Election Of KTR And 23 Other MLAs in Telangana HC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత నవంబర్‌లో జరిగిన శాస నసభ ఎన్నికల్లో గెలిచిన 24 మంది అభ్యర్థుల ఎన్ని కను సవాల్‌ చేస్తూ హైకోర్టులో 24 పిటిషన్లు దాఖల య్యాయి. వారి ఎన్నిక చెల్లదని, శాసనసభ సభ్య త్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కొందరు, తమను ఎమ్మెల్యేలుగా ప్రకటించాలని మరికొందరు పిటిష న్లు దాఖలు చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎన్ని కను కూడా సవాల్‌ చేయడం గమనార్హం. చట్ట ప్రకా రం ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోపు ఆ ఎన్నికను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేయాల్సి ఉంటుంది. కాగా ఈ పిటిషన్లన్నీ ఇంకా స్క్రూటీని దశలోనే ఉన్నాయి. నంబర్లు కాలేదు. అన్నీ సరిగా ఉంటే త్వరలో రిజిస్ట్రీ నంబర్లు కేటాయించనుంది. 

కేటీఆర్‌ విజయంపై పిటిషన్‌
2023 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున కేటీఆర్, కాంగ్రెస్‌ తరఫున మహేందర్‌రెడ్డి పోటీ చేశారు. కేటీఆర్‌కు 89,244 ఓట్లు, మహేందర్‌రెడ్డికి 59,557 ఓట్లు వచ్చాయి. అయితే కేటీఆర్‌ విజయం చెల్లదని, అఫిడవిట్‌లో పూర్తి సమాచారం వెల్లడించలేదంటూ మహేందర్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొ న్నారు. తన కుమారుడిపై ఉన్న 32 ఎకరాల భూమి వివరాలు చెప్పలేదని ఫిర్యాదు చేశారు. అలాగే వీవీ ప్యాట్లను మరోసారి లెక్కించాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేటీఆర్‌ ఎన్నికను రద్దుచేసి తనను ఎమ్మెల్యేగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

హరీశ్‌రావు పూర్తి సమాచారం వెల్లడించలేదు 
సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ నుంచి హరీశ్‌రావు, కాంగ్రెస్‌ తరఫున హరికృష్ణ, బీఎస్పీ నుంచి చక్రధర్‌ గౌడ్‌ పోటీ చేశారు. హరీశ్‌రావుకు 1,05,514, హరికృష్ణకు 23,206 ఓట్లు, చక్రధర్‌కు 16,610 ఓట్లు వచ్చాయి. అయితే గెలిచిన హరీశ్‌రావు అఫిడవిట్‌లో పూర్తి సమాచారం వెల్లడించకుండా రహస్యంగా ఉంచారని, తన కుమారుడి వివరాలు పేర్కొనలేదని చక్రధర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2018లో 36 కేసులుండగా, 2023లో 3 కేసులున్నట్లు చెప్పారని.. మిగతా కేసులు గురించి ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. 

మరికొందరిపై కూడా..
హుజూరాబాద్‌ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) ఎన్నికను సవాల్‌ చేస్తూ ఈటల రాజేందర్‌ (బీజేపీ), జూబ్లీహిల్స్‌ నుంచి మాగంటి గోపీనాథ్‌ (బీఆర్‌ ఎస్‌) విజయాన్ని సవాల్‌ చేస్తూ అజారుద్దీన్‌ (కాంగ్రెస్‌), కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావు ఎన్నికపై బండి రమేశ్‌ (కాంగ్రెస్‌) పిటిషన్లు దాఖలు చేశారు. గద్వాల, ఆసిఫాబాద్, పటాన్‌చెరు, కామా రెడ్డి, షాద్‌నగర్, ఆదిలాబాద్, మల్కాజిగిరి, కొత్త గూడెం తదితర నియోజకవర్గాల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఎన్నికను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థులు పిటిషన్లు వేశారు.

ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్‌లలో అవకతవకలున్నాయని, కొన్ని వివరాలు వెల్లడింలేదని ఆరోపించారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లను మళ్లీ లెక్కించాలని కోరారు. ఇలావుండగా నాగర్‌కర్నూల్‌ నుంచి బీఆర్‌ ఎస్‌ తరఫున పోటీ చేసిన మర్రి జనార్థన్‌రెడ్డి ఎన్ని కల కమిషన్‌ తన విధులను సక్రమంగా నిర్వహించలేదంటూ పిటిషన్‌ వేశారు.  

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top