కావాల్సింది 2.48 లక్షల మెట్రిక్‌ టన్నులు.. ఉన్నది 1.47 ఎల్‌ఎంటీనే | Central government is not increasing the urea quota allocated to the state | Sakshi
Sakshi News home page

కావాల్సింది 2.48 లక్షల మెట్రిక్‌ టన్నులు.. ఉన్నది 1.47 ఎల్‌ఎంటీనే

Jun 27 2025 4:34 AM | Updated on Jun 27 2025 4:34 AM

Central government is not increasing the urea quota allocated to the state

జూలై కోటా యూరియా పూర్తిగా రాకుంటే రైతులకు కష్టాలే 

జూన్‌ వరకే కోటాలో కేంద్రం 2.25 లక్షల మెట్రిక్‌ టన్నుల కోత

ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 1.20 లక్షల మెట్రిక్‌ టన్నులే

ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి వినతుల వెల్లువ

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌ మొదలై నా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరి యా కోటా రాకపోవడంతో వచ్చే రెండు నెలల ను తలచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. రాష్ట్రానికి జూన్‌ వరకే 5 లక్షల మెట్రి క్‌ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, ఇప్ప టి వరకు 2.75 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్ర మే వచ్చింది. వచ్చిన కోటాలోనూ ఇప్పటికే 1.28 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందుబా టులో ఉన్న యూరియా కేవలం 1.47 లక్షల మె ట్రిక్‌ టన్నులే. 

నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో ఇప్పటికే వరినాట్లు మొదలుకాగా, జూలై మొదటి వారంలో రాష్ట్రమంతటా నాట్లు మొదలవుతాయి. ఇప్పటికే సుమారు 25 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసి యూరియాను ఉపయోగిస్తున్నారు. వచ్చే నెల మొదటివారం కల్లా మరో 25 లక్షల ఎకరాల్లో వరిసాగు చేసే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో వరినాట్లు ఉధృతమైతే యూరియా కష్టాలు మొదలైనట్టే. 

కేటాయింపుల్లో ఇప్పటికే 2.25 ఎల్‌ఎంటీ కోత
తెలంగాణలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతు న్నా, రాష్ట్రానికి కేటాయించాల్సిన యూరియా కోటాను మాత్రం కేంద్ర ప్రభుత్వం పెంచడం లేదు. నెలనెలా పంపాల్సిన యూరియాను కూడా పంపించకపోవడంతో నాట్లేసిన తర్వాత రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడు తున్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రానికి పంపాల్సిన కోటాను కోతలు లేకుండా ఇవ్వాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి కోరినా ఫలితం లేదు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కేంద్రం 9.80 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.

» ఏప్రిల్‌లో 1.70 ఎల్‌ఎంటీకి 1.22 ఎల్‌ఎంటీ యూరియా పంపిన కేంద్రం... మేలో 1.60 ఎల్‌ఎంటీకి గాను 87 వేల మెట్రిక్‌ టన్నులే పంపింది. 
» జూన్‌లో 1.70 ఎల్‌ఎంటీకి పంపించింది కేవలం 67వేల మెట్రిక్‌ టన్నులే. 
» మూడు నెలల కోటా కేవలం 2.75 లక్షల మెట్రిక్‌ టన్నులే రాగా, అందులో జూన్‌ నెలలో 1.28 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. 
» వరి, పత్తి, మొక్కజొన్నకు జూలై నెలలో 2.48 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా, ఆగస్టులో మరో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరం. అంటే 6 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చే రెండు నెలల్లో అవసరమవుతుంది. కానీ అందుబాటులో ఉన్న 1.47 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియానే. 

జూలైలో కేంద్రం పంపించే కోటాను బట్టి రైతు లకు యూరియా అందించాలని వ్యవసాయ శా ఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకు కేంద్రం పంపించిన యూరియా జూలైతో పాటు ఆగస్టు మొదటి వారానికి సరిపోతుందని మార్క్‌ ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement